: కూకట్ పల్లిలో కార్పొరేటర్ కొడుకు దౌర్జన్యం... అడ్డొచ్చిన వారిపై దాడి!

హైదరాబాదు శివారు కూకట్ పల్లిలో కార్పొరేటర్ కొడుకు దౌర్జన్యంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ తన స్నేహితులతో కలిసి భాగ్యనగర్ కాలనీలో మద్యం తాగేందుకు ఓ బార్ కు వచ్చాడు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కు హేమంత్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చాడు.

అయితే టిఫిన్ సెంటర్ వెళ్లేందుకు రామకృష్ణ గౌడ్ కారు అడ్డంగా ఉండడంతో ఆ కారును కొంచెం పక్కకు తీయాలని వారు కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన రామకృష్ణ గౌడ్... 'నాకే చెబుతారా?' అంటూ వారిపై దాడికి దిగాడు. దీంతో వారిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా, వారిపై కూడా స్నేహితులతో కలసి దాడికి దిగాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్ బెయిల్ పై వారిని విడుదల చేశారు. 

More Telugu News