: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ వీరికి వర్తించదు... తేల్చి చెప్పిన కోర్టు!
ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఎవరికి వర్తించదనే విషయంలో అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు స్పష్టత ఇచ్చింది. అమెరికాలో నివసిస్తున్న వారి తాతలు, నానమ్మలు (గ్రాండ్ పేరెంట్స్), దాయాదులు (కజిన్స్), వారి దగ్గర బంధువులకు ఈ బ్యాన్ వర్తించదని ముగ్గురు జడ్జిల 9వ యూఎస్ సర్క్యూట్ ఆఫ్ అప్పీల్స్ కోర్టు ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. వారిని అమెరికా రాకుండా అడ్డుకోజాలరని పేర్కొంది. అలాగే పునరావాస సంస్థ ఏజెన్సీ ఆమోదించిన శరణార్థులకు కూడా ఇది వర్తించదని వివరించింది.