: నీట్ రద్దుపై పోరాటం ఎవరి దయా దాక్షిణ్యాలపైన ఆధారపడింది కాదు: కమలహాసన్
తమిళనాడులో నేషనల్ ఎలిజబులిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్)ను రద్దు చేసేందుకు యువత చేసే పోరాటం ఎవరి దయాదాక్షిణ్యాలపైన ఆధారపడింది కాదని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ, నీట్ రద్దు చేయడమనేది యువత భవిష్యత్ కు సంబంధించిందని, ఇప్పుడు పోరాడి సాధించుకోలేకపోతే, రేపటి తరం భవిష్యత్ శూన్యమవుతుందని అన్నారు. ‘కలసి పోరాడుదాం..తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఈ సందర్భంగా యువతకు కమల్ పిలుపు నిచ్చారు. కాగా, తమిళనాడులో నీట్ ను రద్దు చేయాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే కమల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.