: బ్రిటన్ రాణి కేట్ మిడిల్‌టన్ టాప్‌లెస్ ఫొటో ప్రచురించిన మ్యాగజైన్‌కు రూ.76 లక్షల జరిమానా!


బ్రిటన్ ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫొటో ప్రచురించిన ఫ్రెంచ్ సెలబ్రిటీ మ్యాగజైన్‌కు ఫ్రెంచ్ కోర్టు లక్ష యూరోలు (రూ.76 లక్షలు) జరిమానా విధించింది. మ్యాగజైన్ ఎడిటర్, యజమాని చెరో 45వేల యూరోలు జరిమానాగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబరు 2012లో దక్షిణ ఫ్రాన్స్‌లో భర్త విలియంతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్న సమయంలో లాంగ్ లెన్స్ కెమెరా ఉపయోగించి మిడిల్టన్మె టాప్‌లెస్ ఫొటోలను తీసి మ్యాగజైన్‌లో ప్రచురించారు. ఈ ఫొటోపై రాచ కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఫొటోను కొనేందుకు పలు న్యూస్‌పేపర్లు విముఖత వ్యక్తం చేయగా గ్లోసీ గాసిప్ మ్యాగజైన్ ఆ ఫొటోను కొని కవర్‌ పేజీపై ప్రచురించింది. ఆ తర్వాత ఆ చిత్రం పలు ఇతర పత్రికల్లోనూ అచ్చయింది. కాగా, ఈ కేసును విచారించిన కోర్టు ఫొటో ప్రచురించిన మ్యాగజైన్‌ను దోషిగా తేల్చి జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News