: రానా వెబ్‌సిరీస్ `సోషల్` ట్రైలర్ విడుదల... టెక్ కంపెనీ సీఈఓ పాత్రలో కనిపిస్తున్న భల్లాల దేవ
డిజిటల్ మీడియాలోకి వెబ్‌సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్న రానా దగ్గుబాటి నటించిన `సోషల్` వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదలైంది. సైబర్ నేరాలు కథాంశంగా వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఓ టెక్ కంపెనీ సీఈఓ పాత్రలో రానా కనిపించనున్నారు. `వన్ క్లిక్ టు డెస్ట్రాయ్ యువర్ లైఫ్` అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్‌ను రానా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్రైలర్‌లో రానా కొద్దిగా ప్రతినాయక ఛాయలున్నా పాత్ర చేసినట్లుగా కనిపిస్తోంది. సిరీస్‌లో కావాల్సినన్ని థ్రిల్లర్ అంశాలు, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఉన్నట్లు అనిపిస్తోంది. సెప్టెంబర్ 8న ఈ సిరీస్ హిందీ, తెలుగు భాషల్లో వియూ వెబ్ ఛానల్‌లో ప్రసారం కానుంది.