: పరిటాల శ్రీరామ్ పెళ్లి డెకరేషన్ సామాగ్రి తరలిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి అక్టోబర్ 1న జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామాగ్రిని డీసీఎం వ్యాన్ లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ దగ్గర జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం ఆగస్టు 10న హైదరాబాద్ లో జరిగింది. శింగనమల నియోజకవర్గం నార్పల మండలంలోని ఏవీఆర్ కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ఆలం వెంకటరమణ, సుశీలమ్మల కుమార్తె జ్ఞానతో పరిటాల శ్రీరామ్ పెళ్లి నిశ్చయమైంది.