హారర్ మూవీగా 'భీముడు' .. హీరోగా నారా రోహిత్!
'భీముడు' అనే హారర్ మూవీని చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. గతంలో నారా రోహిత్ తో 'సావిత్రి' సినిమా చేసిన పవన్ సాదినేని, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. భయపెట్టే 'భీముడు'గా ఆయన నారా రోహిత్ ను చూపించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ కథ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోగా నారా రోహిత్ సినిమాలు 'కథలో రాజకుమారి' .. 'బాలకృష్ణుడు' ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి.