: ముమైత్ ఖాన్ కొంచెం కాంప్లికేటెడ్ : యాంకర్ కత్తి కార్తీక
ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్టు ముమైత్ ఖాన్ కొంచెం క్లిష్టమైన (కాంప్లికేటెడ్) వ్యక్తి అని తెలుగు ‘బిగ్ బాస్’ షో నుంచి రెండు రోజుల క్రితం ఎలిమినేట్ అయిన యాంకర్ కత్తి కార్తీక అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ మున్నూ (ముమైత్ ఖాన్) కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే, ఆమెకు అన్నీ ఎక్కువే.. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువే. ఆమెకు కోపం వస్తే తట్టుకోలేం. ‘ఇలా తిట్టద్దు’ అని నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. ఆ తర్వాత అలా ఎందుకు తిట్టానంటూ ముమైత్ బాధపడేది. ఏం లాభం? షీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ముమైత్ కు ఉగాది పచ్చడి అని పేరు పెట్టా. ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. అలాగే, ముమైత్ లో కూడా ప్రేమ, కోపం...అన్నీ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది.