: శాంతంగా ఉండండి... గుర్మీత్ అనుచరులకు డేరా సచ్ఛా సౌధా చైర్‌పర్సన్ విజ్ఞప్తి
గుర్మీత్ బాబాకు శిక్ష పడినందుకు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని డేరా సచ్ఛా సౌధా చైర్‌పర్సన్ విపాసన ఇన్సాన్, గుర్మీత్ అనుచరులకు విజ్ఞప్తి చేశారు. గుర్మీత్ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యమున్న ఇద్దరిలో విపాసన ఒకరు. మరొకరు గుర్మీత్ దత్త పుత్రిక హనీప్రీత్. వీరిద్దరూ తమను తాము `గురు బ్రహ్మచారిణి`లుగా చెప్పుకుంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హనీప్రీత్, గుర్మీత్‌కు సంబంధించిన అన్ని అప్‌డేట్లను పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ట్విట్టర్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ కూడా ఆమె నిర్వహిస్తోంది. అలాగే గుర్మీత్ నటించిన `ఎంఎస్‌జీ` సీరీస్ లకు దర్శకత్వం కూడా వహించింది. `ఎంఎస్‌జీ` రెండు, మూడు భాగాల్లో హనీప్రీత్ నటించింది కూడా. గుర్మీత్‌కి శిక్ష పడ్డాక ఆయనతో పాటు హెలికాప్టర్‌లో హనీప్రీత్ కూడా కనిపించింది. ఆయన తర్వాత వీళ్లిద్దరు కలిసి డేరా సచ్ఛా సౌధా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. గుర్మీత్‌కి ఇద్దరు కూతుళ్లు చరణ్ ప్రీత్, అమన్ ప్రీత్, ఒక కుమారుడు జస్మీత్ ఉన్నారు.