: ఆధిక్యంలో కొనసాగుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి... 3 వేలకు దగ్గరైన మెజారిటీ!
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తొలి రౌండ్ లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉన్న భూమా రెండో రౌండ్ ముగిసేసరికి 2,832 ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ లో శిల్పా కన్నా ఆయనకు 1,634 ఓట్లు అధికంగా వచ్చాయి. రెండో రౌండ్ ఫలితం తరువాత వైకాపా అభ్యర్థి వెనుకంజలో ఉండగా, ప్రస్తుతం నంద్యాల గ్రామీణ మండలం ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తరువాత నంద్యాల పట్టణం, ఆపై గోస్పాడు మండలం ఓట్లను కౌంట్ చేయనున్నారు. రెండు రౌండ్లలోనే భూమా ఆధిక్యం 3 వేల ఓట్లకు దగ్గర కావడంతో తెలుగుదేశం వర్గాల్లో ఆనందం కనిపిస్తోంది.