: హీరో విశాల్ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా సోదరి ఐశ్వర్య వివాహం!
దక్షిణాది నటుడు విశాల్ సోదరి ఐశ్వర్య వివాహం ఆదివారం తెల్లవారుజామున ఘనంగా జరిగింది. ప్రముఖ నగల దుకాణం ‘వుమ్మిడి’ కుటుంబానికి చెందిన కృతిశ్ వుమ్మిడితో ఐశ్వర్య పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో కార్తీ దంపతులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజికమాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. కాగా, ప్రముఖ సినీనటి, విశాల్ వదిన శ్రియారెడ్డి గతంలో ఈ విషయమై ప్రస్తావించింది. ఐశ్వర్య, కృతిశ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరగనుందని శ్రియ గతంలో పేర్కొంది.