: ధూమపానం అలవాటున్న భర్తకి వినూత్నంగా గుణపాఠం చెప్పిన భార్య.... వీడియో చూడండి
విపరీతంగా సిగరెట్లు కాలుస్తున్న భర్తకి ఓ భార్య వినూత్న రీతిలో గుణపాఠం చెప్పింది. భర్త ఇంట్లో సిగరెట్ తాగడం వల్ల తాను ఎలా ఇబ్బంది పడుతోందో చూపించడానికి హెయిర్ డ్రయ్యర్ సహాయం తీసుకుంది. చైనాలోని టియాలింగ్ ప్రాంతానికి చెందిన ఈ మహిళ హెయిర్ డ్రయ్యర్ వెనక భాగంలో కొన్ని సిగరెట్లను అమర్చింది. వాటన్నింటినీ ఒక్కసారే వెలిగించి, హెయిర్ డ్రయ్యర్ ఆన్ చేసింది. వాటి పొగ మొత్తాన్ని నిద్రపోతున్న భర్త మీదకి వెదజల్లేలా చేసి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సిగరెట్లు అధికంగా తాగుతున్న భర్తకి, ఈ మహిళ చెప్పిన గుణపాఠాన్ని నెటిజన్లు విపరీతంగా మెచ్చుకుంటున్నారు.