: రజనీకాంత్ ‘రోబో 2.0’ మేకింగ్ వీడియో విడుదల!
దర్శకుడు శంకర్, సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో పత్రిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న 'రోబో 2.0' చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ అభిమానులకు దర్శకుడు శంకర్ ఈ రోజు ఓ గిఫ్ట్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. భారీ సెట్టింగ్స్, రోబోలు, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ఈ వీడియోలో కనపడుతున్నారు. రజనీకాంత్‌ను రోబోగా తీర్చిదిద్దుతున్న విధానం, భయంకరమైన రూపంలో కనపడుతున్న అక్షయ్ కుమార్ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.