: తప్పిన పెను ప్రమాదం.. 360 డిగ్రీల కోణంలో గాల్లోకి తిరిగి ప‌డిపోయిన బైక్.. మీరూ చూడండి!



అతివేగంతో వెళుతున్న ఓ బైక్ ఒక్క‌సారిగా బోల్తా ప‌డిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చైనాలో ఓ వ్యక్తి త‌న భార్య‌పిల్లతో బైక్ మీద రోడ్డుపై వేగంగా వెళుతున్నాడు. అదే స‌మ‌యంలో ఓ కారు ఆ బైక్‌కి అడ్డంగా వ‌స్తోంది. దీంతో ఒక్క‌సారిగా ఆ వ్య‌క్తి త‌న బైక్‌ బ్రేక్ వేయ‌డంతో అది బోల్తా ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో వెనుక‌నుంచి వాహ‌నాలు రాక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

కింద‌ప‌డి మ‌ళ్లీ లేచాక ఆ వ్య‌క్తి బైకుని తీయాల‌ని చూశాడు. అయితే, ఆ బైక్ ఒక్క‌సారిగా ముందుకు దూసుకుపోయింది. దాని వెంటే ఆ వ్య‌క్తి ప‌రుగులు తీసినా అది అత‌డి చేతికి చిక్క‌లేదు. ఇటీవ‌లే చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను చైనా మీడియా త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఆ బైక్‌ వేగం కంట్రోల్‌ కాకపోవడంతో 360 డిగ్రీల కోణంలో గాల్లో తిరిగి ఇలా ప‌డిపోయింద‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News