: నంద్యాల కాల్పులపై అఖిలప్రియ స్పందన


నంద్యాలలో ఈరోజు వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధుల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరుపక్షాలకు చెందిన అనుచరులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. మధు ప్రైవేట్ గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. మరోవైపు మధు కారుపైకి రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఒక పథకం ప్రకారమే మధు కారుపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. కేవలం ప్రాణ రక్షణ కోసమే గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడని చెప్పారు. నంద్యాలలో ఓడిపోతామనే భయంతోనే వైసీపీ ఇలాంటి పనులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ మీడియాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News