: హైవే లిక్కర్ బ్యాన్‌పై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు!
జాతీయ రహదారులపై మద్య నిషేధంపై సుప్రీం ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర, జాతీయ రహదారులపై మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్పు చెప్పిన న్యాయస్థానం ఈ విషయంలో తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. మునిసిపల్ ప్రాంతాలు, సిటీల్లో ఉండే మద్యం వ్యాపారులకు ఇది వర్తించదని తేల్చి చెప్పింది. రాష్ట్ర, జాతీయ రహదారులపై 500 మీటర్లలోపు మద్యం విక్రయాలను నిషేధిస్తూ గతేడాది డిసెంబరు 15న అపెక్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
అయితే జూలై 11న మద్యం విక్రయాలపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన కోర్టు మునిసిపల్ ప్రాంతాలు, సిటీ పరిధిలో ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పట్టణ పరిధిలో జాతీయ రహదారులకు దగ్గరగా ఉండే మద్యం షాపు యజమానులు లైసెన్స్ రెన్యువల్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.