: అప్పులు లేనిదే అభివృద్ధి సాధ్యమా?: కోదండరామ్ కు కర్నె ప్రభాకర్ సూటి ప్రశ్న


అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యమవుతుందా? అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, కోదండరామ్ కు ఎలాంటి ప్రజాస్వామ్యం కావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ జెండా మోస్తున్న కోదండరామ్, విషప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. తెలంగాణలో అబద్ధాలు చెప్పడంలో విఫలమైన కోదండరాం, ఢిల్లీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల టెండర్లు ఈ-ప్రొక్యూర్ మెంట్ విధానంలో పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రాజెక్టులపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఒక్క ఆధారమైనా చూపించారా? అని ఆయన ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News