: పోలీస్ యంత్రాంగం మా పార్టీ ఎమ్మెల్యేల పరువు తీసింది.. క్షమాపణ చెప్పాలి!: నెల్లూరు వైసీపీ నేతలు
నెల్లూరు జిల్లా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో వైసీసీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్రపై పలు ఆధారాలు సేకరించిన పోలీసులు వారిని నిన్న విచారించారు. ఏఎస్పీ శరత్ బాబు ఆధ్వర్యంలో వారిని పలు ప్రశ్నలు అడిగారు. అయితే, ఈ సంఘటనపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులపై బురదజల్లేందుకు అధికార టీడీపీ పన్నిన కుట్రే ఈ బెట్టింగ్ వ్యవహారమని వైసీసీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల పరువు తీసిన పోలీస్ యంత్రాంగం తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.