: ఫేవరెట్ హీరోల జాబితాలో ప్రభాస్‌కు ఐదో స్థానం!
`ఇండియా టుడే` నిర్వహించిన `మూడ్ ఆఫ్ ద నేషన్ 2016-17` సర్వేలో మొదటిసారి ఓ టాలీవుడ్ హీరోకి స్థానం లభించింది. `బాహుబలి` చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ 7 శాతం ఓట్లతో ఫేవరెట్ హీరోల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 11 శాతం ఓట్లతో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌లు మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి రెండు స్థానాల్లో 9 శాతం, 8 శాతం ఓట్లతో షారుక్, అక్షయ్‌లు నిలిచారు. అలాగే హీరోయిన్ల జాబితాలో వరుసగా ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు ఐదు స్థానాల్లో నిలిచారు. సినిమాల విషయానికొస్తే 26 శాతం ఓట్లతో `బాహుబలి2` మొదటి స్థానంలో నిలవగా, ఎవర్‌గ్రీన్ చిత్రం `షోలే` రెండో స్థానంలో, `బాహుబలి` మూడో స్థానంలో, `దంగల్` నాలుగో స్థానంలో నిలిచాయి.