: స్మృతి ఇరానీ వల్లే నా పదవికి రాజీనామా చేశా: పహ్లజ్ నిహ్లాని
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఒత్తిడి కారణంగానే తన పదవికి రాజీనామా చేశానని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) మాజీ చీఫ్ పహ్లజ్ నిహ్లాని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇందు సర్కార్’ సినిమాకు తాను సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతోనే అసలు వివాదం మొదలైందని అన్నారు. అప్పుడు, స్మృతి ఇరానీ తనకు ఫోన్ చేసి ఈ విషయమై ప్రశ్నించగా, ‘నేను సినిమా ట్రైబ్యునల్ ను అనుసరిస్తున్నాను’ అని చెప్పానని అన్నారు. దీంతో, ఆగ్రహించిన ఆమె, తనను బోర్డు నుంచి తొలగించేలా చేశారని ఆరోపించారు. అయితే, ‘ఇందు సర్కార్’ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, అయినప్పటికీ, తాను 70 కత్తిరింపులతో ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చానని చెప్పారు.