: బాలీవుడ్ సినిమా ‘పార్టిషన్:1947’కు పాకిస్థాన్‌లో ఎదురుదెబ్బ.. నిషేధం విధించిన పాక్ ప్రభుత్వం!


ప్రముఖ ఇంగ్లిష్ దర్శకురాలు గురీందర్ చాదా తెరకెక్కించిన ‘పార్టిషన్:1947’ సినిమాకు పాకిస్థాన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. హుమా ఖురేషి, నీరజ్ కబీ, మైష్ దయాల్, దివంగత ఓంపురి నటించిన ఈ సినిమాపై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. భారత చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఇంటిలోని స్టాఫ్ క్వార్టర్స్‌లో ముస్లిం యువతి, హిందూ యువకుడు ప్రేమలో పడతారు. అదే సమయంలో భారత్, పాక్‌లు విడిపోతాయి.. ఈ ఇతివృత్తంతో సాగే ఈ సినిమాను నిషేధిస్తూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తన సినిమాపై నిషేధించడం విధించడంపై గురీందర్ చద్దా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News