: వంట ఎవరు చేయాలన్న వివాదం... ప్రియుడు కొడితే...ప్రియురాలు అతన్ని పొడిచేసింది!


ప్రేమికుల మధ్య రేగిన ‘వంట వివాదం’ ఒకరిని బలితీసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఉజుమ్మా అనే యువతి మూడు నెలలుగా నివాసం ఉంటోంది. ప్రియుడు ఏజు (30) ను తన ఇంటికి ఆహ్వానించింది. వారిద్దరి మధ్య వంట ఎవరు చేయాలన్న వివాదం రేగింది. నువ్వు చెయ్యి అంటే, నువ్వు చెయ్యి అని ఇద్దరూ వాదులాడుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఏజు సహనం కోల్పోయి ఆమెపై దాడి చేశాడు.

 దీంతో ఉక్రోషంతో ఉజుమ్మా వంటింట్లో కత్తి తీసుకొచ్చి బెదిరించింది. దీంతో మరోసారి ఏజు ఆమెపై చేయిచేసుకున్నాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఉజుమ్మా అతనిని పొడిచేసింది. తరువాత తేరుకుని చూసేసరికి ఏజు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్నేహితురాలి సాయంతో ఏజును ఆసుపత్రికి తరలించింది. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో ఉజుమ్మా షాక్ తినగా, వైద్యుల ఫిర్యాదుతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News