: మన కోర్టులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయి!: అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు


ఇండియాలో కోర్టులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న జైట్లీ, కార్యనిర్వాహక వ్యవస్థకు టైమ్ లైన్ ని పాటించడం తప్పనిసరికాగా, న్యాయ వ్యవస్థకు మాత్రం అటువంటి నిబంధనలు లేవని అన్నారు. పార్లమెంట్ చట్ట రూపంలో రూపొందించిన టైమ్ లైన్ తమకు కేవలం మార్గదర్శకాలు మాత్రమే తప్ప, తప్పనిసరి కాదని కోర్టులు పేర్కొంటున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయ శాఖా మంత్రిగా తనకు ఎదురైన అనుభవాలను వివరించిన ఆయన, సివిల్ ప్రొసీజర్ కోడ్ ను ప్రభుత్వం సవరించినా, పరిస్థితిలో మార్పు రాలేదని తెలిపారు. ఇది న్యాయస్థానాల ద్వంద్వ ప్రమాణాలకు సంకేతమని జైట్లీ అన్నారు.

  • Loading...

More Telugu News