: నన్ను తొలగించడానికి కారణం `ఇందూ సర్కార్` సినిమా... నిజాలు బయటపెడుతున్న సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్
తనను పదవి నుంచి తొలగించిన విషయం ప్రసూన్ జోషి చేరేంతవరకు తనకు చెప్పలేదని, `ఇందూ సర్కార్` సినిమా విషయంలో వచ్చిన విభేదాల వల్లే తనను పదవీచ్యుతుడిని చేసినట్లు సీబీఎఫ్‌సీ మాజీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఆ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంపై స్వయంగా సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పాడు.
పహ్లాజ్ పదవిలో ఉన్నపుడు `ఉడ్తా పంజాబ్` సినిమా మొదలుకొని `ఇందూ సర్కార్` వరకు చాలా సినిమా కథలను వివాదాస్పదం చేస్తూ, సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం చేసేవారనే పేరు ఉంది. అలాగే `భజరంగీ భాయ్‌జాన్` వంటి కొన్ని సినిమాల విషయంలో స్వయంగా మంత్రిత్వ శాఖే సర్టిఫికెట్ జారీని జాప్యం చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా పహ్లాజ్ సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా ఉన్నపుడు చాలా సినిమాల్లో ముఖ్యమైన సీన్లకు కత్తెర పడిందన్న విషయం మాత్రం వాస్తవమే.