: అందరు ఎమ్మెల్యేలూ ఇలాగే ఉంటే బాగుంటుంది: జగపతి బాబు
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన జయ జానకీ నాయక సినిమాకు మంచి ఆదరణ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెట్ మీట్ కృష్ణాజిల్లాలోని హంసలదీవిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా నటుడు జగపతి బాబు మాట్లాడుతూ... ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌పై ప్రశంసలు కురిపించారు. చాలా రోజుల తర్వాత ఒక జెంటిల్‌మెన్‌ను చూశానని ఆయన అన్నారు. అందరు ఎమ్మెల్యేలూ ఇలాగే ఉంటే బాగుంటుందని జగపతి బాబు వ్యాఖ్యానించారు. ఈ మూవీని మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేకంగా చూసిన విషయాన్ని గుర్తుచేశారు.