Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీని తక్కువ చేసి మాట్లాడిన రవిశాస్త్రి... తీవ్ర విమర్శలు!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని తక్కువ చేస్తూ, టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి నోరు పారేసుకున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాయేనని ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ రవిశాస్త్రి వ్యాఖ్యానించడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 వరల్డ్ కప్ కు జట్టును సిద్ధం చేయడంపై రవిశాస్త్రిని ప్రశ్నించిన వేళ, సాహా, అద్భుతంగా ఎదిగిపోయాడని, ఆయనకు మరెవరూ సాటి రారని అన్నారు.

 వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్, క్యాచింగ్ విభాగాల్లో సాహా అత్యుత్తమ ఆటతీరును చూపిస్తున్నాడని, ఇప్పటికే ధోనీ స్థానాన్ని ఆక్రమించేశాడని అన్నారు. ధోనీ నీడలో ఎదుగుతూ వచ్చిన సాహా, ఆయన్నే మించిపోయాడని కితాబిచ్చారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం సాహానే నంబర్ వన్ అని అన్నాడు. ధోనీని తక్కువ చేస్తూ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News