: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని భద్రతా సిబ్బందిని బెంబేలెత్తించిన నల్లపతంగి!


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని భద్రతా సిబ్బందిని ఒక పతంగి బెంబేలెత్తించింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దేశరాజధానిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద 9,100 మంది సిబ్బందితో భద్రత చేపట్టారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ప్రధానమంత్రి ప్రసంగించే వేదిక పోడియం వద్దకు నల్లని పతంగి ఎగురుకుంటూ వచ్చింది. అది ప్రధాని ప్రసంగానికి ఎలాంటి ఆటంకం కలింగించకుండా పోడియం కింద ఆగిపోయినప్పటికీ భద్రతాధికారులు మాత్రం ఆందోళన చెందారు. 

  • Loading...

More Telugu News