: నేడు క్యూలోకి వెళితే ఇక రేపే వెంకన్న దర్శనం.. దర్శనం కోసం లక్షమంది వెయిటింగ్!


తిరుమల గిరుల్లో భక్తజనం ఎంతమాత్రమూ తగ్గలేదు. వరుస సెలవులతో గత మూడు రోజులుగా కిక్కిరిసిన తిరుమల క్షేత్రంలో ఈ ఉదయం కూడా లక్ష మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపలికి పోయేందుకే సుమారు 30 వేల మంది భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. ఈ ఉదయం 11 గంటల సమయంలో క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్లిన భక్తులకు రేపు ఉదయం 8 గంటల తరువాత దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్న పరిస్థితి. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మాత్రం ఎప్పటిలా రెండు గంటల సమయమే పడుతోంది. ఇదిలావుండగా, ఈ ఉదయం తిరుమలలో జేఈఓ శ్రీనివాసరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

  • Loading...

More Telugu News