: 48 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు: శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 48,070 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ ఉదయం గోల్కొండ కోటలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఆపై ప్రసంగిస్తూ, నిరుద్యోగులకు పలు వరాలను ప్రకటించారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వం 27,660 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేసిన ఆయన, 36,806 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
మొత్తం 1,12,536 కొత్త ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పిస్తోందని గుర్తు చేసిన కేసీఆర్, కొత్తగా పోలీసు శాఖలో 27,440, ఉపాధ్యాయ వృత్తిలో 12,005, గురుకులాల్లో 12,436, ఆరోగ్య శాఖలో 8,347, సింగరేణిలో 1,970, రెవెన్యూ శాఖలో 2,506, వ్యవసాయ శాఖలో 1,418, అటవీ శాఖలో 2,033, ఎంఏయూడీలో 1,850, ఉన్నత విద్యాశాఖలో 1,673, నీటి పారుదల శాఖలో 1,053, ఆర్థిక శాఖలో 703, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 587, పంచాయితీ రాజ్ శాఖలో 3,528 పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు.