భారీ రేటుకు 'నా పేరు సూర్య' శాటిలైట్ రైట్స్!
విశేషమేంటంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలుకాక మునుపే శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు కావడం. 'జీ తెలుగు' ఛానెల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 10 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శరత్ కుమార్ విలన్ గా నటిస్తుండటం విశేషం. బన్నీ నుంచి ఇంతకు ముందు వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా ఈ ఛానల్ వారే దక్కించుకున్న సంగతి తెలిసిందే.