: ఊహించని విధంగా నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎవరూ ఊహించని వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇండియాలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ, ట్రంప్ ఫోన్ చేసి మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మోదీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య మరింత సత్సంబంధాలు పెంచుకునేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల మోదీ, అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రెండు దేశాల అధినేతలూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో రెండు దేశాలూ అటు రక్షణ, ఇటు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కలసి సాగాలని నిర్ణయించారు కూడా. 

  • Loading...

More Telugu News