నా మనసుకు బాగా నచ్చిన పాత్ర అదే!: నటి రమ్యకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా మనసుకు బాగా నచ్చిన పాత్ర అదే!: నటి రమ్యకృష్ణ

‘బాహుబలి’లో శివగామి పాత్రతో తన నటనాశక్తిని చూపించిన నటి రమ్యకృష్ణ. జస్ట్ ఫర్ ఉమన్ (జేఎఫ్ డబ్ల్యు) ఫొటో షూట్ లో పాల్గొన్న ఆమెను మీడియా పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘నరసింహ చిత్రంలో మీరు పోషించిన నీలాంబరి పాత్ర అంటే ఇష్టమా? పంచతంత్రం సినిమాలో మరఘతవల్లి అలియాస్ మాగీ పాత్ర అంటే ఇష్టమా?’ అని ప్రశ్నించగా..నీలాంబరి పాత్ర వైపే ఆమె మొగ్గు చూపింది. ‘మీరు నటించిన సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన పాత్ర? అని ప్రశ్నించగా..‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్ర అని చెప్పింది. ఇక, ‘బాహుబలి’ హీరో ప్రభాస్ గురించి ప్రశ్నించగా.. ‘అతను అందరికీ డార్లింగే’ అని చెప్పుకొచ్చింది.

More Telugu News