: నా కల అదే...నేను వంద శాతం ప్రయత్నిస్తాను: శివాజీ రాజా


హైదరాబాదులోని మా కార్యాలయంలో రిక్రియేషన్ కార్యాలయంతో పాటు ఒక జిమ్, ఒక ఆసుపత్రి నిర్మించడం తన ఆశయమని శివాజీ రాజా చెప్పాడు. మొన్నామధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా తమకు భోజనం పెట్టే వ్యక్తి తన చేతుల్లోనే కుప్పకూలి కోమాలోకి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నాడు. అతనిని కామినేని ఆసుపత్రికి తరలించానని చెప్పాడు. అలాంటి వారందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. మా ఆధ్వర్యంలో నిర్మించే ఆసుపత్రిలో చిత్రపరిశ్రమలోని అన్ని క్రాఫ్టులకు చెందినవారు ఆనందంగా వైద్య సదుపాయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. అందుకోసం తాను వందశాతం ప్రయత్నిస్తానని అన్నాడు.  

  • Loading...

More Telugu News