: కోదండరామ్‌ను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు.. ఉద్రిక్త‌త


టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు ఈ రోజు కూడా అరెస్టు చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొనేందుకు ఆయ‌న ఈ రోజు తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌ టోల్‌గేట్‌కు చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి, కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆ పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద‌కు టీజేఏసీ కార్య‌క‌ర్త‌లు పెద్దఎత్తున చేరుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. మీడియాను కూడా పోలీసులు లోప‌లికి రానివ్వ‌డం లేదు. మ‌రోవైపు అమరవీరుల స్ఫూర్తి యాత్ర నేప‌థ్యంలో మెదక్‌ జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద సోదాలు చేశారు. నిజామాబాద్‌లో టౌన్‌ హాల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశామని కోదండ‌రామ్ మీడియాతో అన్నారు. దానిపై పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయిన‌ప్ప‌టికీ అరెస్టు చేస్తున్నార‌ని తెలిపారు.     

  • Loading...

More Telugu News