'దృశ్యం' తరువాత మరోసారి తల్లి పాత్రలో మీనా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దృశ్యం' తరువాత మరోసారి తల్లి పాత్రలో మీనా!

తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం కథానాయికగా మీనాకి మంచి క్రేజ్ వుంది. అలాంటి మీనా రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి, తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తోంది. అలా 'దృశ్యం; సినిమాలో టీనేజ్ అమ్మాయికి తల్లిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అభినందనలు అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను ఆమె తల్లి పాత్రను పోషిస్తోందట.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి ఎపిసోడ్ ఉందట. ఆయన తల్లి పాత్రకి మీనా అయితే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  
meena

More Telugu News