: స్నేహితురాలి మాజీ బాయ్ ఫ్రెండ్ ను కాల్చిచంపాడు... దమ్ముంటే పట్టుకోవాలని పోలీసులకు నిత్యమూ సవాల్!


తన గర్ల్ ఫ్రెండ్ మాజీ స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపిన ఓ యువకుడు, ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాడు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని నిత్యమూ ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో సవాల్ విసురుతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రాజస్థాన్ లోని గంగానగర్ కు చెందిన దీపక్ మాలిక్ కు ఇందుబాల అనే యువతి స్నేహితురాలు. ఆమె గతంలో హర్యానాకు చెందిన వినోద్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేది.

ఇందుబాలతో కలసి ప్లాన్ చేసిన దీపక్, వినోద్ ను తుపాకితో కాల్చి చంపాడు. ఆపై పరారయ్యాడు. ఆ తరువాత పోలీసులకు సవాళ్లు మొదలయ్యాయి. రోజూ ఫేస్ బుక్ లోకి వస్తూ, తుపాకులు పట్టుకుని ఫోజులు ఇస్తూ, తనను పట్టుకోవాలని చాలెంజ్ చేస్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఇందుబాల మాత్రం పోలీసు కస్టడీలో ఉంది. కేసులో ప్రధాన నిందితుడు దీపక్ ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News