: దినకరన్ ను 420 తో పోల్చిన సీఎం పళనిస్వామి!
అన్నాడీఎంకే పార్టీ లో రెండు వర్గాల ప్రతినిధులైన ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం నేడు ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సీఎం పళనిస్వామి సమావేశమయ్యారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. అన్నాడీఎంకే పార్టీ విచ్ఛిన్నానికి దినకరన్ కారణమయ్యారని, 420 అనే దానికి ఆయన సరిగ్గా సరిపోతారని ఆరోపించారు. డీఎంకే నేత స్టాలిన్ మరోమారు అవిశ్వాస తీర్మానం పెడతారనే విషయమై విలేకరులు ఆయన్ని ప్రశ్నించగా, మళ్లీ తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ ఎలిజబులిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరానని పళనిస్వామి చెప్పారు.