: టీఆర్ఎస్ కు ఝలక్ ఇస్తూ.. సొంత గూటికి డీఎస్?


తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ మళ్లీ సొంత గూటికి చేరనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. గాంధీభవన్ లో పీసీసీ బీసీ సెల్ నేతల సమావేశం సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. డీఎస్ టీఆర్ఎస్ కు ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ లోకి మళ్లీ ఎందుకు రావాలనుకుంటున్నారు? అనే విషయంపై చర్చ సాగింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2015 జూలైలో కాంగ్రెస్ పార్టీకి డీఎస్ గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆయన్ని రాజ్యసభకు పంపించింది. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ను తనకు కేటాయించాలని సోనియాను డీఎస్ కోరారట. అయితే, ఆమె ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు, రాహుల్ గాంధీతో చనువుగా ఉండే ఓ వర్గం డీఎస్ రీఎంట్రీని వ్యతిరేకిస్తోందని సమాచారం.

  • Loading...

More Telugu News