: 'ఎంత బాగుందో' అంటూ చిట్టి మిథాలీని దీవించిన మిథాలి రాజ్!


భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ట్విట్టర్ వేదికగా చిట్టి మిథాలీని ఆశీర్వదించింది. వివరాల్లోకి వెళ్తే అదానీ సోలార్ కంపెనీలో ఇంజనీర్ గా పని చేసే అపూర్వ ఎక్బోటే కుమార్తె ప్రాథమిక విద్యనభ్యసిస్తోంది. ఆమెకు స్కూల్ లో 'ఇష్టమైన జాతీయ నాయకుల దుస్తులు ధరించాలి' అంటూ అసైన్‌ మెంట్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా బాలిక భారత మహిళా క్రికెటర్లు ధరించే దుస్తులు ధరించి...‘నేను మిథాలీ రాజ్‌ ని... భారత మహిళల క్రికెట్‌ కెప్టన్‌ ను’ అని పేర్కొంది.

దీనిని వీడియో తీసిన ఆమె తండ్రి... 'మాకిష్టమైన నేషనల్‌ స్టార్‌ టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌. ఆమె నా కూతురికి ఆదర్శం' అంటూ పోస్టు చేశాడు. దీనిని చూసిన మిథాలీ రాజ్ స్పందించి, ‘చిట్టి తల్లి తన జీవిత లక్ష్యాలన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆశీర్వదించింది. దీనికి మరో మహిళా క్రికెటర్ స్మృతి మందన స్పందిస్తూ, 'నీలాంటి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవడం మిథాలీ సేనకు ఆనందం...నీ కలలు సాకారమవ్వాలి' అని దీవించింది. 

  • Loading...

More Telugu News