: పీహెచ్డీ పూర్తి చేయాలంటే నా కోరిక తీర్చాల్సిందే అన్న ప్రొఫెసర్... పోలీసులకు ఫిర్యాదు చేసిన విదేశీ యువతి!


విద్యాధికుడు, ఉన్నతోద్యోగిగా సమాజంలో గౌరవం, హోదా పొందుతున్నాడు. అయినప్పటికీ కామంతో కన్నూమిన్నూ కానకపోవడంతో ప్రొఫెసర్ పై పోలీస్ కేసు నమోదైంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పూణెలోని యశ్వంత్‌ రావు మోహిత్‌ కళాశాలలోని శివాజీ బోర్హడే అనే అధ్యాపకుడి (ప్రొఫెసర్) దగ్గరకు ఇరాన్ కు చెందిన విద్యార్థిని (31) వెళ్లింది. ఉన్నత విద్యనభ్యసించిన సదరు యువతి తనకు పీహెచ్డీ చేయాలని ఉందని, అందుకు సాయం చేయాలని శివాజీ బోర్హడేను కోరింది.

గైడ్ గా ఉండేందుకు తనకు అభ్యంతరం లేదని, అయితే అలా చేయాలంటే ముందు తన కోరిక తీర్చాలని వేధింపులకు దిగాడు. దీంతో వారిద్ధరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మొత్తాన్ని రికార్డు చేసిన ఇరాన్ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఎవరైనా విద్యార్థి పీహెచ్డీ చేయాలంటే గైడ్ ను వెతుక్కోవాల్సిన బాధ్యత విద్యార్థిదే కావడంతో ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News