: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయొద్దు: సుప్రీంకోర్టు ఆదేశం
పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ సమర్పించని వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయొద్దని ఇన్సూరెన్స్ కంపెనీలను భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఎన్‌సీఆర్ ఢిల్లీ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకులకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు ఉండేలా చూడాలని రవాణా మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం అధికారులకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. 1985లో పర్యావరణవేత్త ఎంసీ మెహతా వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.