: గ్రామ పెద్ద కోసం డ్యాన్స్ బార్ గా మారిన పాఠశాల... యూపీలో కలకలం రేపుతున్న వ్యవహారం!


విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సరస్వతీ నిలయాన్ని, ఊరి పెద్ద మెప్పు కోసం డ్యాన్స్ బార్ గా మార్చేశాడో ఉపాధ్యాయుడు. యూపీలోని మీర్జాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అమ్మాయిలతో అర్థనగ్న డ్యాన్సులు చేయించిన సదరు ఉపాధ్యాయుడు, పాఠశాలను బార్ గా మార్చేశాడు. గ్రామ పెద్ద రాంకేష్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలంటూ, స్కూల్ కు సెలవు ఇచ్చేసి, బయటి నుంచి అమ్మాయిలను తెప్పించి నృత్యాలు చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

దీనిపై మరో ఉపాధ్యాయుడి నుంచి ఫిర్యాదు అందగా అధికారులు వచ్చి విచారణ జరిపి, విద్యాశాఖకు నివేదికను అందించారు. విద్యార్థులు నోట్స్ రాసుకునే బెంచీలు మందు గ్లాసులు పెట్టుకునే టేబుళ్లుగా మారిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా, అసలీ కార్యక్రమం జరిగినప్పుడు తాను అక్కడ లేనని, బంధువుల ఇంట ఉన్నానని చెప్పి సదరు గ్రామ పెద్ద తప్పించుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News