Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పెషల్ సాంగ్ అంటే కేథరిన్ ఉండాల్సిందే అంటున్నారట!

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కేథరిన్ సినిమాలు చేస్తూ వస్తోంది. గ్లామర్ పరంగా ఈ సుందరికి ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి గానీ, నటన విషయంలో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతోంది. దాంతో రెండవ కథానాయికగానే అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయి  గ్లామర్ డోస్ పెంచేయడమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ కి ప్రాధాన్యతనిస్తోంది. ఆమె చేస్తోన్న స్పెషల్ సాంగ్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

దాంతో తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్ అనుకున్న దర్శక నిర్మాతలు ముందుగా కేథరిన్ పేరునే ప్రస్తావిస్తున్నారట. గ్లామర్ పరంగా కేథరిన్ కి వంక బెట్టాల్సిన పనేలేదు. సాంగ్ బాగుండాలే గానీ అమ్మడు దుమ్ముదులిపేస్తుంది. అందువలన స్పెషల్ సాంగ్స్ కోసం ఆమెను సంప్రదిస్తున్నవారి సంఖ్య పెరుగుతోందట. అయితే భారీ స్థాయిలో పారితోషికం వుంటేనే ఆమె ఓకే చెబుతోందనే టాక్ వినిపిస్తోంది.    
catherine

More Telugu News