: యువతులతో కలసి థింసా నృత్యం చేసిన చంద్రబాబు!
ఈ ఉదయం అరకులోయలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆదివాసీ గిరిజన యువతులతో కలసి డ్యాన్స్ చేస్తూ సేదదీరారు. వారు తమ సంప్రదాయ థింసా నృత్యం చేస్తుంటే, వారి చేతులు పట్టుకుని చంద్రబాబు కూడా కాసేపు నృత్యం చేశారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్ సైతం చేరిపోయారు. ఇక్కడి గిరిజనులు తయారు చేసే ఆహార ఉత్పత్తులను పరిచయం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అరకు లోయ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడి గాలి స్వచ్ఛమైనదని అన్నారు. అంతకుముందు ఆదివాసీ దినోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఇక్కడి అందాలు గవర్నర్ నరసింహన్ కు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాయని తెలిపారు. అరకు ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి వున్నానని తెలిపారు.