: అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న బాసర అర్చకుడికి గుండెపోటు


ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తెచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ శర్మ గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

కాగా, అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చాడన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ నుంచి సంజీవ్ కు నోటీసులు కూడా అందాయి. అయితే, తాను విగ్రహాన్ని బయటకు తీసుకెళ్లలేదని, సదరు కార్యక్రమ నిర్వాహకులే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆయన వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News