: డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడడానికి నిరాకరించిన దర్శకుడు బోయపాటి శ్రీను
టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్న విషయం విదితమే. అయితే, కొంత మంది మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు. ఈ రోజు దర్శకుడు బోయపాటి శ్రీను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర‌్భంగానే ఆయనను డ్రగ్స్ వ్యవహారంపై మీ స్పందన ఏంటీ? అంటూ మీడియా ప్రశ్నించింది. దానిపై ఆయన నోరు విప్పలేదు. ఇక తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ నెల 11 న విడుదల కానున్న ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్ నటించారు.