: జైలులో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దిలీప్... నిద్రలేమితో అనారోగ్యం?
ప్రముఖ నటి భావన లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన మలయాళ స్టార్ హీరో దిలీప్ జైల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఒక ఆంగ్లపత్రిక తెలిపింది. దీంతో ఆయన నిద్రలేమి రాత్రులు గడుపుతున్నారని, అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని. పర్యవసానంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపింది. భద్రతా కారణాల రీత్యా ఆయనను ఆసుపత్రికి తరలించడం లేదని, జైల్లోనే వైద్యమందిస్తున్నారని చెప్పారు.
భావన కేసులో దిలీప్ భార్య కావ్యమాధవన్ ను పోలీసులు పదేపదే ప్రశ్నించడంపై ఆయన ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 2న దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ ను ప్రశ్నించిన పోలీసులు, ఆయనతో వివాహానికి దారితీసిన పరిస్థితులు, వివాహానికి ముందు, తరువాత ఆయన వ్యవహార శైలిపై కూపీ లాగినట్టు తెలుస్తోంది. కాగా, దిలీప్ కు మూడు వివాహాలు అయినట్టు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.