: పవన్ చిత్రాల్లోని ఏదో ఒక సీన్ ను వాడుతూనే ఉంటా!: హీరో నితిన్
తన కొత్త చిత్రం 'లై'ని దర్శకుడు హను రాఘవపూడి తన ప్రాణం పెట్టి తీశారని, మణిశర్మ అందించిన సంగీతం, రీరికార్డింగ్ ప్రేక్షకులను అలరిస్తుందని హీరో నితిన్ వ్యాఖ్యానించాడు. 'లై' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, హనుతో తన ప్రయాణం ఒక సంవత్సరం నుంచి సాగుతోందని అన్నారు. తొలుత 'సార్' అని పిలుచుకునే వాళ్లమని, ఆ తరువాత పేర్లు పెట్టి పిలుచుకున్నామని, ఇప్పుడు 'ఏరా పోరా' అని పిలుచుకునేంతగా దగ్గరయ్యామని నితిన్ అన్నాడు.
చాలా ఏళ్ల క్రితం 'శ్రీఆంజనేయం' తరువాత ఈ చిత్రంతో అర్జున్ తో కలసి నటించానని, క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ లో ఆయన అద్భుతంగా చేశారని, సినిమాలో తమ ఇద్దరి మధ్యా నడిచే గేమ్ ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుందని అన్నాడు. తాను పవన్ కల్యాణ్ కు వీరాభిమానినని, 'తమ్ముడు' సినిమాలో లుంగీ కట్టుకుని బీడీ కాల్చే సీన్ ను ఇందులో వాడుకున్నామని తెలిపాడు. తన జీవితాంతం పవన్ చిత్రాల్లోని ఏదో ఒక సీన్ ను వాడుతూనే ఉంటానని తెలిపాడు.