: తెలుగు ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబునాయుడు
అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ జరుపుకుంటున్న వారందరికీ ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. `రక్షా బంధన్ జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు` అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.