: `బిగ్ బాస్`లా దూసుకుపోతున్న స్టార్ మా!
తెలుగు టీవీ ఛానళ్లలో ఎక్కువ మంది స్టార్ మా ఛానల్‌నే చూస్తున్నారని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చి కౌన్సిల్ నివేదికలో తేలింది. `బిగ్ బాస్` రాకతో స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇతర కార్యక్రమాల రేటింగ్‌లు కూడా ఊపందుకుంటున్నాయి. గత వారం (22 జూలై - 28 జూలై) నివేదికలో 5,75,255 వ్యూయర్ ఇంప్రెషన్స్‌తో స్టార్ మా టాప్ తెలుగు ఛానల్‌గా నిలిచింది. అలాగే టాప్ 5 కార్యక్రమాల్లో కూడా స్టార్ మా ఛానల్ కార్యక్రమాలే మూడు ఉన్నాయి. ఈ రకంగా రేటింగ్స్ రావడానికి ఎన్టీఆర్ బిగ్‌బాస్ మేజిక్కే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.